‘పది’ విద్యార్థులకు మార్గనిర్దేశం
బాసర: బాసరలో ఆర్జీయూకేటీ కళాశాల ఆధ్వర్యంలోముధోల్‌లో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ మార్గదర్శక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగమైన ఎస్‌డీజీ 4 (నాణ్యమైన విద్య) పట్ల నిబద్ధతతో, టీమ్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రతినిధులు ముధోల్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్/జేసీ(బి)లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో శిక్షణా ప్రోగ్రామ్ అధికారి విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నతవిద్య, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై వివరించారు. విద్యా ప్రణాళిక, కెరీర్‌పై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ సుస్థిర విద్యాభివృద్ధిపై ఆర్జీయూకేటీ బాధ్యతను హైలైట్ చేశారు. విద్యార్థులలో అవగాహన పెంచడం, సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా టీమ్ ట్రాన్స్‌ఫార్మ్ విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, రణధీర్‌సాగి తదితరులు పాల్గొన్నారు.


