‘హామీలు మరిచిన ప్రభుత్వం’
నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తమ కు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక విస్మరించిందని వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాక ర్ ఆరోపించారు. వీవోఏల సమస్యలు పరిష్కరించాలని బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని వీవోఏ లు ముట్టడించారు. దీనిని ముందే గ్రహించిన పోలీ సులు కలెక్టరేట్ ఎదుట భారీ బందోబస్తు చేపట్టి వీవోఏలను లోనికి అనుమతించకుండా అడ్డుకున్నా రు. దీంతో వీవోఏలు గేటు బయట బైఠాయించా రు. అనంతరం ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మూడేళ్లుగా రావాల్సిన సీ్త్రనిధి ఇన్సెంటివ్ డబ్బులు వీవోఏలు, వీవోలకు ఇప్పించాలని కోరారు. సీ్త్రనిధి బ్యాంక్ నుంచి వీవోఏలకు నేరుగా రూ.10వేల వేతనంతో పాటు ట్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, సీనియారిటీ ప్రాతిపదికన వీవోఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని సూచించారు. పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీవోఏలు స్వప్న, సంగీత, శరత్, పవన్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.


