అందువల్లే ఆగంతకుడు ఈజీగా రాగలిగాడు: ఎంపీ గోరంట్ల | Sakshi
Sakshi News home page

అందువల్లే ఆగంతకుడు ఈజీగా రాగలిగాడు: ఎంపీ గోరంట్ల

Published Wed, Dec 13 2023 4:23 PM

Ysrcp Mp Gorantla Madhav Caught Stranger In The Lok Sabha - Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఇద్దరు యువకులు.. లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్‌ గ్యాస్‌ వదిలారు.

లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి.. గతంలో పోలీస్‌గా పని చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పట్టుకున్నారు. అనంతరం ఆయన లోక్‌సభ దాడి ఘటనపై మీడియాకు వివరించారు. బెంచీలు దాటుకొని, స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చిన ఆగంతకుడు.. దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని తెలిపారు. పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారన్నారు.

సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడని, సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలన్నారు. ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే’’ అని గోరంట్ల మాధవ్‌ అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement