జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు! | Young bodybuilder dies after gym session in Karnataka | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు!

Jun 18 2026 2:47 PM | Updated on Jun 18 2026 3:05 PM

Young bodybuilder dies after gym session in Karnataka

కర్ణాటకలోని దావెణగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) జిమ్‌లో వర్కౌట్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలిన ఘటన కలకలం రేపింది. అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతున్న ఈ యువ ప్రతిభావంతుడి మరణం అతని కుటుంబానికి, క్రీడా సమాజానికి ,కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

 దావెణగిరిలో కేటీజే లేఅవుట్ నివాసి అయిన సుశీల్ కుమార్, అతను ప్రస్తుతం ఒక అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీకి సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లిన సుశీల్ కుమార్, రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు.  కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మార్గమధ్యలోనే గుండెపోటుతో అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.ఆసుపత్రిలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ తల్లి దేవమ్మ కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. శోక సంద్రంలో ముగినిపోయిన ఆమె  ఇక తనకు దిక్కెవరంటూ  గుండెలవిసేలా రోదించిన తీరున పలువురి కంట కన్నీరు తెప్పించింది.(రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)

కాగా జిమ్‌ చేసే సమయంలో యువత  వైద్యుల సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కండలు పెంచే క్రమంలో మత్తుమందులు, స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన ఆహారం, వైద్య పరీక్షలు, అధిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయడం ఉత్తమ మంటున్నారు.

 ఇదీ చదవండి : ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement