మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగికి షాక్‌! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు!

Woman Query On marrying fiance who got laid off from Microsoft - Sakshi

ప్రపంచంలోని దిగ్గజ టెక్ సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేల మంది ఉద్యోగుల్ని అర్థాంతరంగా తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం ఊడిపోడవంతో తమ జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయో అనేక మంది టెకీలు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లుబోసుకుంటున్నారు. మొన్నటివరకు రూ.లక్షలు సంపాదించిన తాము ఇ‍ప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో  ఓ యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. తన జీవితంలో ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సలహా ఇవ్వాలని నెటిజన్లను అడిగింది. ఇంతకీ ఈమె చేసిన ఆ పోస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ యువతికి కొద్దిరోజుల క్రితమే పెళ్లి నిశ్ఛయం అయింది. వరుడు మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఫిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే లేఆఫ్స్‌లో అతడి ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అతడ్ని తాను ఇంకా పెళ్లి చేసుకోవాలా? లేకపోతే వివాహం రద్దు చేసుకోవాలా? అని యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడంలేదని సలహాలు ఇవ్వాలని కోరింది.

ఈమె పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయు. హృదయ ప్రమేయం లేనప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎంత సులభం.. అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ మాత్రం ఇది చాలా కామెడీగా ఉందని చమత్కరించాడు. 

మరొకరు మాత్రం ఆమెకు మూడు పరిష్కారాలు సూచించాడు. 1. అతనికి త్వరలో మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వేచి చూడటం. 2. మెక్రోసాఫ్ట్ అతడ్ని అకస్మాతుగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు డబ్బు బాగానే ఇస్తుంది కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోవడం. 3. నువ్వు హిపోక్రైట్ అని చెప్పి పెళ్లి రద్దు చేసుకో. అని బదులిచ్చాడు. పాపం ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని మరో నెటిజన్ స్పందించాడు.

చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్‌లో యువతి రుబాబు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top