ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం | wife and husband incident in karnataka | Sakshi
Sakshi News home page

ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం

Apr 19 2026 9:17 AM | Updated on Apr 19 2026 11:33 AM

wife and husband incident in karnataka

పెళ్ళయిన రెండున్నర సంవత్సరాలకే  భర్త అకృత్యం 

 వేధింపులను సెల్‌ఫోన్‌లో భద్రపరిచిన భార్య 

హత్య కేసు మిస్టరీని ఛేదించిన సెల్‌ఫోన్‌ వీడియోలు  

సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. 

భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. 

భార్యను అంతమొందించాలని వేధింపులు 
అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. 

భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్‌ చేసి కావ్య ఫోన్‌ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్‌ఫోన్‌ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్‌ఫోన్‌ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement