Viral Video: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన

Viral Video: Man Barking Like Dog Name In Ration Card Spelt Kutta - Sakshi

ప్రభుత్వాధికారులతో పనిపడినా లేక ఏదైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఒక పట్టాన పని అవ్వదు. మన పనులన్ని పక్కన పెట్టుకుని వారి చుట్టు కాళ్లు అరిగేలా తిరిగితే గానీ పనవ్వదు అందరికి తెలిసిందే. అందువల్లే ప్రజలు ప్రభుత్వాధికారులంటేనే చాలా భయపడతారు. అచ్చం అలానే ఒక వ్యక్తి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోయేసరికీ విచిత్రమైన రీతిలో నిరసనలో అధికారుల వెంట తిరిగి అనుకున్నది సాధించాడు.

వివరాల్లోకెళ్తే....బెంగాల్‌లోని శ్రీకాంత్‌ కుమార్‌ దత్తా అనే వ్యక్తికి తన రేషన్‌ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్‌ కుమార్‌ దత్తా బదులు శ్రీకాంత్‌ మెండల్‌ అనే పడింది. దీంతో సదరు వ్యక్తి వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంతో దత్తా అని మార్చారు. దీంతో అతను మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఈసారి ఏకంగా శ్రీకాంతి కుమార్‌ కుత్తాగా మార్చారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం.

దీంతో సదరు వ్యక్తి వినూత్నంగా కుక్కలా మొరుగుతూ...దురే సర్కార్‌ ప్రభుత్వా కార్యాలయంలోని  అధికారుల చుట్టు ఆ రేషన్‌ కాగితాలతో తిరుగుతూ వివరిస్తాడు. అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ అని గుర్తు ఉన్న కారులోని అధికారుని చూసి అతన్ని వెంబడించి....తన కాగితాలను కారు విండోలోంచి ఇచ్చి తన సమస్యను కుక్కలా అరుస్తూ వివరించాడు. సదరు అధికారి రెండు రోజుల్లో పేరు సరిచేస్తామని తనకు హామి ఇచ్చారని తెలిపాడు శ్రీకాంత్‌.

తన పేరు రేషన్‌ కార్డులో పదేపదే తప్పుగా ప్రింట్‌ అవుతుండటంతో తో విసిగిపోయి ఇలా విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తన సమస్యను వివరించినట్లు చెప్పాడు. అంతకుముందు ఒక అధికారికి తన మొర వినిపించానని, అతను భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్‌ సంగతేంటి?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top