Viral Video: గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం

ఇటీవల కాలంలో ఉన్నటుండి మోగ జీవులు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఒక్కసారిగా మనుషుల వలే భక్తిప్రపత్తులు చాటుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవలే కోకొల్లుగా జరిగాయి. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి పూణేలో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక శునకం గణేశుడి దేవాలయం వద్ద మోకరిల్లి ప్రార్థిస్తోంది. అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా ప్రార్థిస్తున్నాడు. ఈ ఘటనను విశాల్ అనే వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
అతను ఇన్‌స్టాగ్రామ్‌లో 'పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిర్ వద్ద ఏం జరుగుతుందో చూడండి' అని ఒక క్యాప్షన్ పెట్టి మరీ వీడియోని పోస్ట్ చేశాడు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
(చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...)
సంబంధిత వార్తలు