
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది.
ఒకటే ఏడుపు...
పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు.
ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.