How to Jasmine Flower Making With Tissue Paper, in Telugu - Sakshi
Sakshi News home page

మల్లెపూలు అనుకుంటున్నారా..కాదండోయ్‌!

Feb 25 2021 10:45 AM | Updated on Feb 25 2021 4:01 PM

Viral: Mother Makes Jasmine Gajra With Tissue Paper For Daughter - Sakshi

దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ..తర్వాత పరీక్షగా చూసి షాక్‌ కు గురయ్యింది

న్యూఢిల్లీ: అమ్మాయిలకు పువ్వులకు విడదీయలేని బంధం ఉందని అంటారు. అందుకే వారిని పువ్వులతో పోలుస్తారు. ఒక తల్లి తన కూతురు సురేఖ పిళ్ళైకి ఏదైన  సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంది. వెంటనే ఒక టిష్యూపేపర్‌ తీసుకొని దానితో ఒక మల్లెపుల బొకే తయారుచేసి చేతిలో పెట్టేసింది. దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ..తర్వాత పరీక్షగా చూసి షాక్‌ కు గురయ్యింది.

అంతేకాకుండా, కుర్తాసేట్‌, వెండిరింగులు, బింది మొదలైనవి తయారు చేసి ఇచ్చింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సురేఖ తల్లి అధ్బుతమైన కళను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. నెటిజన్లు మొదట సురేఖలాగే మోసపోయి, తీరా అది టిష్యూపేపర్‌తో తయారు చేసినవని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిది తెగవైరల్‌ అయ్యింది. మీ అమ్మాగారి కళకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్‌లు పెడుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement