ఢిల్లీ హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి

Violence In Hanuman Jayanti Procession Delhi Jahangirpuri - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. వివరాల ప్రకారం.. శనివారం ఊరేగింపు జరుగుతుండగా చోటు చేసుకున్న అల్లర్ల కారణంగా స్థానికులతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఆ ప్రాంతంలోని పలు వాహనాలను ధ్వంసం చేశారు.

దీంతో అధికారులు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు అదనపు పోలీస్‌ బలగాలను రప్పించారు. ఘటనపై స్పందిస్తూ.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఢిల్లీ సీఎం, ఎల్జీ పిలుపునిచ్చారు. అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి తీసుకోవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top