‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’ | Vinod Raj Meets Renuka Swamy Family Members | Sakshi
Sakshi News home page

‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’

Jul 31 2024 8:06 AM | Updated on Jul 31 2024 9:47 AM

Vinod Raj Meets Renuka Swamy Family Members

దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన నటుడు వినోద్‌ రాజ్‌ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ వస్తున్నాయి. దర్శన్‌, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్‌రాజ్‌ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్‌ రాజ్‌...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్‌ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement