బిగ్‌బాస్‌ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్‌ఐకి బదిలీ | Bigg Boss Varthur Santosh Was Honored By The Police Station, SI Gets Transferred - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్‌ఐకి బదిలీ

Feb 11 2024 8:32 AM | Updated on Feb 11 2024 12:45 PM

Varthur Santosh was honored by the police station - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో లో ఫైనల్స్‌కు చేరిన వర్తూరు సంతోష్‌ను బెంగళూరులో ఎస్‌ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు.

యశవంతపుర: బిగ్‌బాస్‌ రియాలిటీ షో లో ఫైనల్స్‌కు చేరిన వర్తూరు సంతోష్‌ను బెంగళూరులో ఎస్‌ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్‌ దయానంద.. ఆ ఎస్‌ఐని వర్తూరు పీఎస్‌ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు.

బిగ్‌బాస్‌లో పేరుగాంచిన సంతోష్‌కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్‌ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్‌ కాగా అనేకమంది ఎస్‌ఐని తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement