రేపు శివసేనలోకి ఊర్మిళ | Urmila Matondkar To Join Shiv Sena On Tuesday | Sakshi
Sakshi News home page

రేపు శివసేనలోకి ఊర్మిళ

Nov 30 2020 7:21 AM | Updated on Nov 30 2020 7:21 AM

Urmila Matondkar To Join Shiv Sena On Tuesday - Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ గ్లామర్‌ తళుకులు అద్దుకుంటోంది. బాలీవుడ్‌ నటి, రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్‌ శివసేన గూటికి  చేరనున్నారు.  మంగళవారం ఆమె పార్టీలో చేరనున్నట్టుగా శివసేన నాయకుడొకరు తెలిపారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున  పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ ఆ తర్వాత అయిదు నెలలకే పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. ఆ తర్వాత ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె హఠాత్తుగా శివసేన గూటికి చేరనున్నట్టుగా తెలుస్తోంది.  చదవండి: (తలైవా తేల్చేనా...నాన్చేనా..?)

గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో ఊర్మిళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో తన పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు.  పరిమితమైన పాత్రలో ఉండలేనంటూ పార్టీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ మీడియాలో లీక్‌ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ శివసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement