టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 29th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Dec 29 2020 6:07 PM | Updated on Dec 29 2020 6:22 PM

Today Top News 29th December 2020 - Sakshi

ఎన్డీయేలో టెన్షన్‌.. ప్రధాని అభ్యర్థిగా నితీష్‌!
బిహార్‌లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. పూర్తి వివరాలు..

రాజకీయాలు వద్దు నాన్నా...
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన రజనీ చివరకు ఓ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పారు. ఈక్రమంలోనే చేతిలో ఉన్న అన్నాత్తే సినిమా కోసం ఆయన అహర్నిశలు పనిచేసిన్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు..

‘అది చిడతల నాయుడికే చెల్లింది’
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..

నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడు..
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌ మీద ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్‌.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పూర్తి వివరాలు..

బాబుపై సీఎం జగన్‌ వ్యంగ్యాస్త్రాలు
వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్‌ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాలు..

రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రేపు (బుధవారం) విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు..

తాగి బండి నడిపేవాళ్లు టెర్రరిస్టులే: సజ్జనార్‌
మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..

హక్కుల కార్యకర్తకు ఆరేళ్ల జైలు..
సౌదీలో ప్రముఖ మహిళాహక్కుల కార్యకర్త లౌజైన్‌ అల్‌ హత్‌లౌల్‌కు సోమవారం సుమారు ఆరేళ్ల కారాగార శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టెర్రరిజ వ్యతిరేక చట్టం కింద ఆమెకు శిక్ష పడినట్లు తెలిసింది. పూర్తి వివరాలు..

అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్‌ నమోదు 
ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్‌ 259 పాయింట్లు జంప్‌చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్‌ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! పూర్తి వివరాలు..

బంపర్‌ ఆఫర్‌‌ అందుకున్న మోనాల్‌.. ‌
అప్పటి వరకు వాళ్ల ఫేమ్‌ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్‌ గజ్జర్‌ చేరిపోయింది. పూర్తి వివరాలు..

బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఘన విజయం..
పింక్‌ బాల్‌ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement