
ఆ ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుంది
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని, తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పూర్తి వివరాలు..
కుటుంబ పాలనతో లూటీ: తరుణ్ చుగ్
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. తండ్రి కొడుకుల పార్టీ తెలంగాణను దోచుకుంటుందని దుయ్యబట్టారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.. పూర్తి వివరాలు..
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు..
సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సాహ్నిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. పూర్తి వివరాలు..
జస్టిస్ రాకేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ సంక్షోభం’ అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. దీనితో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు..
ఆ క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి: ప్రధాని మోదీ
నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తూ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. పూర్తి వివరాలు..
చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ
ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని.. అతిపెద్ద దేశంగా అవతరించడమే దాని ప్రధాన ఉద్దేశం. పూర్తి వివరాలు..
ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ ని తీసుకొచ్చింది. నేటి నుండి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు..
మర్డర్ సినిమా; మిర్యాలగూడలో విడుదల..
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెండో ట్రైలర్ గురువారం విడుదలయ్యింది. పూర్తి వివరాలు..
ఆసీస్ 191 ఆలౌట్, బుమ్రా బ్యాటింగ్..
భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి సేన మెరుగైన స్థానంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయిన టీమిండియా ప్రత్యర్థి జట్టును 191 పరుగులకు కట్టడి చేసింది. పూర్తి వివరాలు..