సీఎస్‌ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్‌

CM YS Jagan Felicitated To CS Neelam Sahni In Amravati - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ సాహ్నిని శుక్రవారం ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌తోపాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు. కాగా 2019 నవంబర్‌ 14న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. సాహ్ని 2018 నుంచి ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. చదవండి: జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top