తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం, వారికి ఊరట

TN Stalin govt introduces bill for quota to govt students in professional courses - Sakshi

ప్రభుత్వ  పాఠశాలలో చదివితేనే రిజర్వేషన్లు:  సీఎం  స్టాలిన్‌

ప్రొఫెషనల్ కోర్సుల్లో  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ బిల్లు

 బిల్లును స్వాగతించిన ప్రతిపక్ష అన్నాడీఎంకే

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఊరటనిచ్చారు.  ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటా కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును స్వాగతించడం విశేషం.

చదవండి: వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌, 13 మంది మృతి

ప్రభుత్వం యూనివర్సిటీల్లో వెటర్నరీ సైన్సెస్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని కేటగిరీలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్థిక అసమానతల కారణంగా వారు కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందలేకపోయారని వ్యాఖ్యానించారు. గ్రామాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు.

చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?

కాగా ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రభుత్వ-ఎయిడెడ్ కళాశాలల్లో రిజర్వేషన్లపై జస్టిస్ (రిటైర్డ్)డీ మురుగేశన్ కమిటీ సిఫారసుల మేరకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం గతంలో నిర్ణయించింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top