సలసల కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి నైవేద్యం

Tiruvannamalai Adiparashakti Temple: Devotees Take vada in boiling Oil - Sakshi

సాక్షి, చెన్నై(వేలూరు): తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె.అగరం గ్రామంలో అయ్యారమ్మన్‌ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి.

ఆఖరి రోజైన మంగళవారం సాయంత్రం అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్‌ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.  

చదవండి: (మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top