
చెన్నై: తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ మందుబాబుతో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తిని తిట్టి బస్సు నుంచి కిందకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మద్యం మత్తులో బస్సు ఎక్కిన వ్యక్తి తూలుతూ కన్పించాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని బస్సు దిగిపోవాలని కండక్టర్ వారించాడు. దీంతో ఆ వ్యక్తి ఆపసోపాలు పడుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా.. కండక్టర్ అతనిపై బాటిల్‌తో నీళ్లుపోశాడు. అనంతరం మెట్లపై నుంచి తోసేశాడు. ఫలితంగా అమాంతం అతడు కిందపడిపోయాడు. అయితే అతనికి గాయాలయ్యయా, పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా కండక్టర్ బస్సును పోనివ్వమన్నాడు.
#government #TamilNadu #TamilnaduNews #bus #conductor pic.twitter.com/rGI9BMv1Rv
— MAHES ARUN AMD (@mahes_arun_amd) November 19, 2022
తిరవన్నమళైలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఆ వ్యక్తి బస్సులోనే మద్యం తాగుతున్నాడని, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తూ రచ్చ చేయడం వల్లే బస్సు నుంచి దించేసినట్లు కండక్టర్ వివరించాడు. ప్రయాణికులకు అసౌకర్యం కలగవద్దనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..