-
సలసల కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి నైవేద్యం
సాక్షి, చెన్నై(వేలూరు): తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె.అగరం గ్రామంలో అయ్యారమ్మన్ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఆఖరి రోజైన మంగళవారం సాయంత్రం అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: (మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి) -
ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు
సాక్షి, కామారెడ్డి క్రైం: తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అక్కతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమెపై చెల్లి మరిగిన నూనె పోసింది. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసు కుంది. కాలనీలో నివాసం ఉండే షేక్ చాందిని, నా గూర్‌బీలు అక్కాచెల్లెళ్లు. ఇది వరకే ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటోంది. చెల్లెలు నాగూర్‌బీ కూడా శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండేది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి తన అక్క కూడా సన్నిహితంగా ఉంటుందని జీర్ణించుకోలేక కాగుతున్న నూనెను నిద్రిస్తున్న చాందినిపై తన చెల్లెలు నాగూర్‌బీ పోసింది. తీవ్రగాయాలైన చాందినిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసుధన్‌గౌడ్ తెలిపారు. చదవండి: ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో -
8 ఏళ్ల బాలుడిపై పోలీసు వికృత చర్య
-
పోలీసు వికృత చర్య : 8 ఏళ్ల బాలుడిపై..
లక్నో: ప్రజలకు దగ్గర కావడానికి పోలీసులు ఇటీవల కాలంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చర్యలతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... మథురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శాంతి ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారి 8 ఏళ్ల బాలుడిపై మరుగుతున్న నూనె పోశాడు. దీంతో బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు గోవర్ధన్-బర్సానా రోడ్డును దిగ్భందించారు. ఈ సంఘటనకు కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలకు దిగారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రోడ్డుపై కొందరు దుండగులు మద్యం సేవించి పోలీస్ అధికారిని వెంబడించడంతో, భయపడిన అధికారి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాలుడిపై వేడి నూనె పడిందన్నారు. ఏదేమైనా దీనికి కారణమైన పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. -
కాగుతున్న నూనెలో పడి.. చిన్నారి మృతి
ఆదిలాబాద్: పండుగకు చేసుకునే పిండివంటలు... ఆ పాప పాలిట యమాపాశలయ్యాయి. కాగుతున్న నూనెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన అమూల్య (2) ఈ నెల 21న పక్కింట్లో అప్పాలు చేస్తుండగా పొయ్యి దగ్గరకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాగుతున్న నూనె కళాయిలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement