పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు

Theft At Partha Chatterjee House Locals Mistake It As ED Raid - Sakshi

కోల్‌కతా: టీచర్‌ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్‌ చేసి విచారిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇప‍్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఈడీ దాడుల వేళ మంత్రి ఫార్థా ఛటర్జీకి సంబంధించిన సౌత్‌ 24 పరగానాల ప్రాంతంలోని నివాసంలో చోరీ జరిగింది. జులై 27న బుధవారం రాత్రి ఓ దొంగ ఇంట్లోకి దూరి అందినకాడికి దోచుకెళ్లాడు. 

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లాడు దొంగ. పెద్ద పెద్ద బ్యాగుల్లో పార్థా ఛటర్జీ ఇంట్లోంచి చాలా వస్తువులు తీసుకెళ్లాడు. అయితే.. ఆ దొంగను గమనించిన స్థానికులు అది మరో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేడ్‌ రైడ్‌గా భావించారటా. అలా వారు అనుకోవటమే ఆ దొంగకు అదృష్టంగా మారింది. అందినకాడికి దోచుకెళ్లాడు. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్‌మెంట్‌లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top