Thanksgiving Day History : ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోయారా?

Thanksgiving 2021: Significance of popularity of this festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనిషిగా పుట్టింది మొదలు గిట్టే వరకు ఆ ‘నలుగురి’ సాయం లేకుండా సాగదు. ప్రస్తుతం ఒక స్థాయికి చేరుకోగలిగాము అంటే కచ్చితంగా ఎందరో తోడ్పాటు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు,స్నేహితులు ఈ కోవలో ముందు వరుసలో నిలుస్తారు. చాలా సందర్భాల్లో చాలా క్లిష్టసమయాల్లో మన జీవితంలో చాలామంది పరోక్షంగానో ప్రత్యక్షంగా సాయపడతారు. మన కరియర్‌లో కీలక మలుపు తిరగడానికి దోహద పడతారు.​

ఫలానా వారి వల్లే నేను జీవితంలో ఇంత స్థాయికి చేరుకున్నాను అనుకుంటాం కదాం.  అలాంటి  వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు  చెప్పందుకే ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ డే. క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకుని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవడం కోసమే ఈ రోజు. వారు చేసిన సేవ, సాయంగాని, ముఖ్యమైన సలహా గానీ, చేసిన మేలు,  త్యాగం ఇలా  ఏదైనా గుర్తు చేసుకోవడం. మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం.

ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటి సారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తరువాత మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం  రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్‌ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతోపాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు.

భారతదేశంలో ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేనప్పటికీ, అమెరికా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్‌తో సహా ఇతర దేశాలలో కూడా థాంక్స్ గివింగ్ జరుపు కుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేలా ఉంటుంది. ఆసక్తికరంగా, కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్‌  గివింగ్‌ డే వేడుక ఉంటుంది.  

జీవితంలో తెలిసో తెలియకో, పాజిటివ్‌గానో, నెగిటివ్‌గానో ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవడానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సెకండ్‌వేవ్‌తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో  ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 24 గంటలూ నిద్రాహారాలు  మాని, బాధితులకు ఎనలేని సేవలందించారు. వారి త్యాగాలు, సేవలకు విలువ కట్టడం అసాధ్యం. అలాంటి వారిందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. సో... ఇంకెందుకు ఆలస్యం...అలాంటి  గొప్ప వ్యక్తులు అందరికీ  థ్యాంక్స్‌ చెప్పేయండి!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top