అరెస్ట్‌ చేయకపోవడం సీరియస్‌ విషయం!

Supreme Court Takes up Issue of Pending Cases Against Lawmakers - Sakshi

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న చట్ట సభల సభ్యులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్‌ అంశమని వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద సంఖ్యలో క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఒత్తిడికి తలొగ్గి వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్‌ కేసుల విచారణకు వీడియో కాన్ఫెరెన్స్‌ సదుపాయం కల్పించాలని పలు హైకోర్టులు కోరుతున్నాయని తెలిపింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తాజాగా తమకు అందించాలని, అలాగే, కేసుల త్వరిత విచారణకు తమ రాష్ట్రంలో ఎన్ని వీడియో కాన్ఫెరెన్స్‌ సదుపాయాలు అవసరమవుతాయో తెలపాలని హైకోర్టులను జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణ త్వరితగతిన సాగేందుకు కింది కోర్టులపై హైకోర్టుల కఠిన పర్యవేక్షణ అవసరమని ఈ విచారణలో అమికస్‌ క్యూరీగా నియమితుడైన సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా సూచించారు. (చదవండి: గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top