న్యాయవాదుల నకిలీ డిగ్రీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court says CBI to investigate lawyers law degrees | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల నకిలీ డిగ్రీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

May 15 2026 5:15 PM | Updated on May 15 2026 5:46 PM

Supreme Court says CBI to investigate lawyers law degrees

సాక్షి,న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వేలాది మంది న్యాయవాదుల విషయంలో సీబీఐ దర్యాప్తు అవసరమరని సూచించింది.  

‘వేలాది నల్ల గౌన్లు ధరించిన వ్యక్తులు ఫేక్‌ డిగ్రీలతో న్యాయవృత్తిలో ఉన్నారు. సీబీఐ ఏదో ఒకటి చేయాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో కొంతమంది న్యాయవాదుల మాటతీరు, వారు చేస్తున్న పోస్టులు వారి అర్హతలపై తీవ్రమైన సందేహాలు కలిగిస్తున్నాయని అన్నారు.

ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గుర్తింపు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో వెలువడ్డాయి. పిటిషనర్ సంజయ్ దూబే కోర్టును అవమానించేలా వ్యవహరించారని సుప్రీంకోర్టు భావించింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో సంజయ్‌ దూబే మాటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవృత్తిలో క్రమశిక్షణ అంటే ఏమిటో చూపిస్తాను’ అని హెచ్చరించగా.. సీనియర్ అడ్వకేట్ గుర్తింపు కేవలం  స్టేటస్ సింబల్‌గా మారిందా లేక న్యాయవ్యవస్థకు సేవ చేయడానికా అని న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం సదరు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించడంతో, పిటిషనర్‌ చివరికి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.ఈ సందర్భంగా కోర్టు, సమాజంలో ఇప్పటికే న్యాయవ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఉన్నారని, న్యాయవాదులు వారితో కలిసిపోవద్దని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement