Raghu Rama Krishna Raju: ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి కేసు.. ఎంపీ రఘురామ కుమారుడిపై  బలవంతపు చర్యలొద్దు

Supreme Court Dismisses To MP Raghu Rama Krishna Raju Petition - Sakshi

పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ కాని స్టేబుల్‌పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

ఆగస్టు 12న ఇదే పిటిషన్‌ విచారించి కొట్టివేశామని, ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్‌లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్‌లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు.

తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని  పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్‌ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.  

చదవండి: (సీఎం జగన్‌ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top