పది పాసైనందుకు విద్యార్థి చేసిన పని... తెగ మెచ్చుకుంటున్న విద్యా మంత్రి

Student Installs Flex Board Congratulating Himself For Passing10th Exam - Sakshi

మనం ఏదైనా ఎగ్జామ్‌ పాసైతే మన దోస్తులకు మనకు తోచిన విధానంలో  ఓ చిన్న పార్టీ ఇచ్చి సంబంరం చేసుకుంటాం. బాగా డబ్బు ఉన్నవాడేతే వాడి రేంజ్‌లో పార్టీ ఇ‍వ్వడమే లేక ఖరీదైన వస్తువులు తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇవ్వడమో జరుగుతుంది. వీటన్నింటీకీ చాలా భిన్నంగా ఉన్నంతంగా ఒక విద్యార్థి తన సాధించిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

వివరాల్లోకెళ్తే...కేరళలో పదోతరగతి ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. ఈ మేరకు జిష్ణు అనే అబ్బాయి మంచి మార్కులో పదోతరగతి పాసయ్యాడు. దీంతో తన సాధించిన విజయాన్ని చాలా వెరైటీగా సెబ్రేట్‌ చేసుకున్నాడు జిష్ణు. తనను తాను అభినందించుకంటూ ఒక ఫ్లక్సీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇది కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌ కుట్టికి తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఆ మంత్రి జిష్ణు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ...ఆ విద్యార్థి ఫ్లెక్సీ బోర్డులో ఏం రాశాడో వివరించారు.  ఇంతకీ ఆ అబ్బాయి ఫ్లెక్సీలో.... కొంతమంది వస్తే చరిత్ర మారిపోతుంది. తాను కూడా అంతేనని. అలాగే జీవిత పరీక్షలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు.

దీంతో  మంత్రి ఆ అబ్బాయి తను సాధించిన వియాన్ని సెలబ్రేట్‌ చేసుకున్న తీరు నచ్చిందని, చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లో సహాకరాం అందిస్తాం అని పోస్ట్‌ చేశారు. కేరళలో ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది పైనే పదోతరగతి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top