breaking news
Tent exams
-
మీ పాలనలో విద్యారంగం బ్రష్టుపట్టిపోయింది
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యావ్యవస్థే ఇలా ఉంటే మిగిలిన రంగాలను ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలంటించారు. టెన్త్ పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, లోకేశ్ పూర్తిగా ఫెయిలయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పదో తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పులను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమని నిలదీశారంటే..విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ కష్టాలేచంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణతిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు.. ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబూ.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? అనేక సంస్కరణలను దెబ్బతీశారుమన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను అధికారంలోకి వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు–నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు. లోకేశ్ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలిచంద్రబాబూ.. మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్ మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను -
యూట్యూబ్‌లో టెన్త్ ప్రశ్నాపత్రాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకుని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్లో ఎంతో పకడ్బందీ రక్షణలో ఉంచాలి్సన పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్లోడ్ కావడం.. ఎక్కడ లీకైందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్చి–2025లో జరిగే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఇదే తీరున ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.అర్ధ వార్షిక పరీక్షల్ని సక్రమంగా నిర్వహించేలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహస్తారోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మేథ్స్ పేపర్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షను నిలిపివేశారు. మేథ్స్ పరీక్షను ఈ నెల 20న నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల రక్షణలో ఉండే ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లంఈ విద్యా సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీల్డు కవర్లో ఉంచాలి్సన పేపర్లను ఓపెన్‌గానే అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్–1 అసెస్మెంట్ల పరీక్ష పేపర్లు మండల రిసోర్సు సెంటర్ల (ఎంఈవో కార్యాలయం)లో సీల్డు కవర్లో ఉంచి భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్చార్జి టీచర్ వెళ్లి ఉదయం మధ్యాహ్నంజరిగే పేపర్లను ఎంఈవో నుంచి తీసుకుని తమతమ పాఠశాలకు తెచ్చి మిగతా ఉపాధ్యాయుల సమక్షంలో సీలు తెరవాల్సి ఉంటుంది. ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం గమనార్హం.వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 7న మెగా పేరెంట్స్ డే నిర్వహించడం, 14న రెండో శనివారం కావడంతో ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉండడంతో అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు నిలిపివేసి, మిగిలిన చోట పూర్తి చేశారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పేపర్లు పూర్తయ్యాయి.మార్చి–2025 పబ్లిక్ పరీక్షలపై అనుమానాలు?ఎస్ఏ–1 ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు. కాగా, అర్ధ వార్షిక పరీక్ష పేపర్ల లీకేజీతో మార్చి–2025లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్ పణంగా పెట్టాలి్సన పరిస్థితి తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడులను రాజకీయ ప్రచారాలు, ప్రయోగాలకు కేంద్రాలు మార్చేశారని.. పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. -
TS: పదో తరగతి పరీక్షలు ప్రారంభం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పరీక్ష సమయానికి సెంటర్లోకి అనుమతించారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఇక, ఏప్రిల్ రెండో తేదీ వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. అయితే ఈనెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే డీఈవోలకు, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది వరంగల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్ష కేంద్రాల సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయటపెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. -
ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు 13వ తేదీ వరకు జరుగుతాయి. గత సంవత్సరం వరకు పదోతరగతిలో 11 పేపర్లతో పరీక్షలు జరగగా, వాటిని ఈసారి 6 ప్రశ్నపత్రాలకు కుదించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. 2,652 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.bse. telangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకంతో పాటు స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్ఎంను పరీక్ష కేంద్రానికి డిప్యూట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా టీఎస్ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రిపరేషన్ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుందని ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షలకుసంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
పది పాసైనందుకు విద్యార్థి చేసిన పని... తెగ మెచ్చుకుంటున్న విద్యా మంత్రి
మనం ఏదైనా ఎగ్జామ్ పాసైతే మన దోస్తులకు మనకు తోచిన విధానంలో ఓ చిన్న పార్టీ ఇచ్చి సంబంరం చేసుకుంటాం. బాగా డబ్బు ఉన్నవాడేతే వాడి రేంజ్లో పార్టీ ఇవ్వడమే లేక ఖరీదైన వస్తువులు తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇవ్వడమో జరుగుతుంది. వీటన్నింటీకీ చాలా భిన్నంగా ఉన్నంతంగా ఒక విద్యార్థి తన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...కేరళలో పదోతరగతి ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. ఈ మేరకు జిష్ణు అనే అబ్బాయి మంచి మార్కులో పదోతరగతి పాసయ్యాడు. దీంతో తన సాధించిన విజయాన్ని చాలా వెరైటీగా సెబ్రేట్ చేసుకున్నాడు జిష్ణు. తనను తాను అభినందించుకంటూ ఒక ఫ్లక్సీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టికి తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఆ మంత్రి జిష్ణు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ...ఆ విద్యార్థి ఫ్లెక్సీ బోర్డులో ఏం రాశాడో వివరించారు. ఇంతకీ ఆ అబ్బాయి ఫ్లెక్సీలో.... కొంతమంది వస్తే చరిత్ర మారిపోతుంది. తాను కూడా అంతేనని. అలాగే జీవిత పరీక్షలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. దీంతో మంత్రి ఆ అబ్బాయి తను సాధించిన వియాన్ని సెలబ్రేట్ చేసుకున్న తీరు నచ్చిందని, చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లో సహాకరాం అందిస్తాం అని పోస్ట్ చేశారు. కేరళలో ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది పైనే పదోతరగతి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు