
సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాలను(రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఐక్యతా శిల్పంతోపాటు సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ సందర్శకులకు ఐదు రోజులపాటు అనుమతి ఉండదని వెల్లడించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: హమ్మయ్య.. ముంబై నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది)