ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌: 25271 కానిస్టేబుల్‌ పోస్టులు

SSC Constable GD Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)... వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 25271
పోస్టుల వివరాలు: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ల్లో కానిస్టేబుల్‌ పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌. 

విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌–7545, సీఐఎస్‌ఎఫ్‌–8464, ఎస్‌ఎస్‌బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్‌–3785, ఎస్‌ఎస్‌ఎఫ్‌–240

జీతభత్యాలు: పేస్కేల్‌–3 ప్రకారం–రూ.21700–రూ.69100

అర్హత: 01.08.2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
 
వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష(సీబీఈ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ సాండర్ట్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఇంగ్లిష్‌/హిందీ 25ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021
► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
► వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top