భారత్‌లో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదం.. వీడియో వైరల్‌

Shopkeeper Plays Pakistan Zindabad Song In UP - Sakshi

లక్నో: భారత్‌, పాకిస్తాన్‌ విషయంలో రెండు దేశాలకు సంబంధించిన స‍్లోగన్స్‌ విషయం ఎంతో సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్‌లో పాకిస్తాన్‌ జిందాబాద్‌.. అంటూ స్లోగన్స్‌తో ఉన్న పాటను వింటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసులో భాగంగా నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ (రూరల్) ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ వెల్లడించారు. 

ఈ ఘటన అనంతరం నిందితుడి తల్లి మాట్లాడుతూ.. "ఏం జరిగిందో మాకు తెలియదు. నా చిన్న కొడుకు తన మొబైల్ ఫోన్‌లో మతపరమైన పాటలు విన్నాడని చెబుతున్నారు. ఫోన్‌లో అలాంటి నినాదాలు ఉన్నాయని అతనికి తెలియదు. మేము ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లో అలాంటి పాటలు ప్లే చేయలేదు. అతను చదువుకోలేదు. దయచేసి నా కొడుకును విడుదల చేయండి’’ అని పోలీసులను అభ్యర్థించింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నినాదాలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది యూపీలోని నోయిడాలో ఓ మతపరమైన ఊరేగింపులో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top