Karnataka Shimoga School: 58 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

Shimoga School Suspends 58 Hijab Clad Students For Protesting Entry Ban - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం​ కొనసాగుతోంది. హిజాబ్‌ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్‌ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు.

అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హైకోర్టు సూచించింది. అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు హిజాబ్‌ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీనిపై సీరియస్‌ అయిన శివమొగలోని కర్ణాటక పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం 58 మందిని సస్పెండ్‌ చేసింది. అలాగే హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్‌ ఉల్లంఘన కింద శివమొగ పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..)

మరోవైపు ముస్లిం వస్త్రధారణలో  హిజాబ్‌ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫామ్‌ ధరించాలన్న గవర్నమెంట్‌ ఆర్డర్స్‌ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్‌ జనరల్‌ అన్నారు. అయితే హిజాబ్‌ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్‌ జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని బెంచ్‌ అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top