ఏడేళ్ల బాలికకు సమన్లు 

Seven Years Girl Got Summons From Court For School Development Work - Sakshi

విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు  

సాక్షి, తిరువళ్లూరు: పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయాలని కోర్టు మెట్లు ఎక్కిన ఏడేళ్ల బాలికను విచారణకు హాజరు కావాల్సిందిగా మీంజూరు పోలీసులు సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మీంజూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో పాటు గోడలకు బీటలు వారాయి. దీంతో ఆందోళన చెందిన రెండో తరగతి బాలిక ముత్తరసి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌ సహా పలువురు ఉన్నత అధికారులకు విన్నవించుకుంది.

అయితే వారు చర్యలు చేపట్టకపోవడంతో తన తండ్రి సాయంతో హైకోర్టులో పిటిషన్‌ను వేసింది. బాలిక వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, మీంజూరు పాఠశాలకు ఆరు నెలల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాలికకు మీంజూరు పోలీసులు బుధవారం ఉదయం నోటీసులు జారీ చేశారు. మీంజూరు పోలీస్‌స్టేషన్‌కు నేరుగా వచ్చి హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top