రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

SCR Give Permissions To Kolhapur to Nagpur Train - Sakshi

కరోనా ప్రభావం రైల్వే శాఖపై అధికంగా పడిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించే సమయంలో రైళ్ల రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, అన్ లాక్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే అధికారులు నడుపుతున్నారు. మొదట కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన అధికారులు క్రమంగా వాటి సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సోమ, శుక్రవారాల్లో నడిచే కొల్హాపూర్‌-నాగ్‌పూర్‌ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ రైలు కొల్హాపూర్‌ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్‌-కొల్హాపూర్‌ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు నాగ్‌పూర్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ఈ రైలు కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

చదవండి:

ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!

భారీగా పడిపోయిన బంగారం ధరలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top