పక్కాగా పాత వాహనాల రీసైక్లింగ్‌  | Recycling of old vehicles 134 Centers | Sakshi
Sakshi News home page

పక్కాగా పాత వాహనాల రీసైక్లింగ్‌ 

Mar 21 2026 5:22 AM | Updated on Mar 21 2026 5:49 AM

Recycling of old vehicles 134 Centers

దేశవ్యాప్తంగా 134 స్క్రాపింగ్‌ కేంద్రాలు 

పర్యావరణ పరిరక్షణకు కఠిన నిబంధనలు 

డిజిటల్‌ వ్యవస్థలు, పెట్టుబడులకు ప్రోత్సాహం 

వాహన యజమానులకు ప్రోత్సాహకాలు

పర్యావరణ నిబంధనలు, భవిష్యత్‌ చర్యలు 

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పాత, పనికిరాని వాహనాల (ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్స్‌–ఈల్‌వీఎస్‌) రీసైక్లింగ్‌ను పర్యావరణానికి అనుకూలంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన పటిష్ట వ్యవస్థను రూపొందించినట్లు ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో చెప్పారు. 

అనధికార రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి మార్పులో భాగంగా దేశంలో పాత వాహనాల స్క్రాపింగ్‌ ఇప్పటివరకు ప్రధానంగా అనధికార రంగంలో జరుగుతోందన్నారు. దీనిని నియంత్రిత వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ‘వాహన స్క్రాపింగ్‌ పాలసీ’(వాలంటరీ వెహికల్‌ ఫ్లీట్‌ మోడరైజేషన్‌ ప్రొగ్రాం–వీ–వీఎంపీ) అమలు చేస్తోందన్నారు. దీనికి అనుగుణంగా 2021లో మోటార్‌ వాహనాల (వాహన స్క్రాపింగ్‌ సౌకర్యాల నమోదు మరియు విధులు) నిబంధనలు రూపొందించి, అనంతరం పలు సవరణలు చేసిందన్నారు. 2026 మార్చి 10 నాటికి దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 134 రిజిస్టర్డ్‌ వాహన స్క్రాపింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి.  

ఏటా ఆడిటింగ్‌ 
అనధికారికంగా వాహనాల విభజన వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై ప్రత్యేక అధ్యయనం జరగనప్పటికీ, ఆర్‌వీఎస్‌ఎఫ్‌ఎస్‌లో పర్యావరణ భద్రతకు కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ‘కలుíÙతాలు లీక్‌ కాకుండా ప్రత్యేక డీ–పాల్యూషన్‌ పరికరాలు, ఆయిల్, బ్యాటరీలు, గ్యాస్‌ వంటి హానికర పదార్థాల వేరు నిల్వ, ఎఫ్లుయెంట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, నీటి రీసైక్లింగ్‌ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, శబ్ద కాలుష్య నియంత్రణ వంటివి ఉన్నాయన్నారు. అదనంగా ఏటా ఆడిట్‌తో స్క్రాపింగ్‌ కేంద్రాల పనితీరును అంచనా వేస్తున్నట్లు వివరించారు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తు సౌకర్యం 
స్క్రాపింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు సౌకర్యం కలి్పంచినట్లు పేర్కొన్నారు. అలాగే నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ‘వీ్రస్కాప్‌’మాడ్యూల్‌ ద్వారా వాహనాల స్క్రాపింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌ చేసినట్లు వెల్లడించారు. పాత ప్రభుత్వ వాహనాల వేలం కోసం ‘ఎంఎస్‌టీసీ’, ‘జీఈఎం’పోర్టల్స్‌ ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలకు ప్రోత్సాహంగా 2025–26లో ప్రత్యేక సహాయం పథకం కింద రూ.2వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 

పలు రాయితీలు 
స్క్రాపింగ్‌ కేంద్రాల్లో వాహనాలను సమర్పించే వారికి ప్రభుత్వం రాయితీలు అందిస్తోంందన్నారు. ప్రధానంగా.. ‘కొత్త వాహన నమోదు ఫీజు మినహాయింపు, మోటార్‌ వాహన పన్నులో 15శాతం నుంచి 25శాతం వరకు రాయితీ, పాత బీఎస్‌–1, బీఎస్‌–2 వాహనాల మారి్పడిపై 50శాతం వరకు పన్ను తగ్గింపు’అని వివరించారు. ప్రస్తుతం ఉన్న 134 ఆర్‌వీఎస్‌ఎఫ్‌ఎస్‌ ద్వారా సంవత్సరానికి సగటున 10వేల నుంచి 12వేల వాహనాలను స్క్రాప్‌ చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటివరకు 4,60,979 వాహనాలు స్క్రాప్‌ చేయగా, ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,79,792 వాహనాలు స్క్రాప్‌ చేసినట్లు తెలిపారు.  

ఈపీఆర్‌ విధానం 
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 2025లో ‘ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్స్‌ రూల్స్‌’కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించిందన్నారు. ఇందులో వాహన తయారీదారులకు ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్‌) విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, కాలుష్య నియంత్రణ మండలి– 2023 మార్గదర్శకాల ద్వారా పాత వాహనాల విభజన, రీసైక్లింగ్‌ ప్రక్రియను సురక్షితంగా నిర్వహించే విధానాలను నిర్దేశించిందన్నారు. దేశంలో పాత వాహనాల రీసైక్లింగ్‌ను పర్యావరణ అనుకూల, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్కారీ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement