రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు వ్యక్తి డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. 2018 నుంచి రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామాచార్యులును సచివాలయంలో అత్యున్నత పదవికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపిక చేశారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు. 1952లో రాజ్యసభ ఆవిర్భవించినప్పటి నుంచి 70 ఏళ్ల కాలంలో రాజ్యసభ సచివాలయంలో పనిచేసిన అధికారి సెక్రటరీ జనరల్ కావడం ఇదే ప్రథమం. రామాచార్యులు పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణలో సుమారు 40 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు.
చదవండి: 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
