రూ.75 స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని | Prime Minister Narendra Modi releases a commemorative coin of Rs 75 | Sakshi
Sakshi News home page

Oct 16 2020 2:06 PM | Updated on Oct 16 2020 2:06 PM

Prime Minister Narendra Modi releases a commemorative coin of Rs 75 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) 75 వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు. ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేస్తూ స్మారక నాణాన్ని శుక్రవారం విడుదల చేశారు.ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎఫ్ఏఓ , ‘సాహీ పోషన్ దేశ్ రోషన్’ అనే  హిందీలో ఉంటుంది.అలాగేే నేడు ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇటీవల  అభివృద్ధి చేసిన 17 ర‌కాల బయోఫోర్టిఫైడ్  పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెల్చుకోవడం గొప్ప విష‌య‌ని ఈ  సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మకమైంద‌న్నారు. బలహీన వర్గ ప్రజలను , ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు. 2016 లో అంతర్జాతీయ పప్పుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన సంస్థ, 2023 ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇయ‌ర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్ర‌క‌టించింద‌ని, దీనికి భార‌త మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని ప్రధాని మోదీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement