సాతంత్య్ర దినోత్సవం: శర్మిష్ఠ ముఖర్జీ భావోద్వేగ ట్వీట్‌

Pranab Mukherjee Daughter Sharmistha Mukherjee Shares Emotional Independence Day Post - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్‌ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. ఈ కారణంగా ఆయన శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్ర‌ణ‌బ్ హాజ‌రు కాక‌పోవ‌డంతో.. ఆయ‌న కూతురు ష‌ర్మిష్ట ముఖ‌ర్జీ త‌న తండ్రి జ్ఞాప‌కాల‌ను ట్విటర్ వేదిక‌గా పంచుకున్నారు. (చదవండి : వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌)

‘చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్‌ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా  నాన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మిస్‌ చేసుకోలేదు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం నాకుంది’అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్‌ ఫోటోలను ఆమె షేర్‌ చేశారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top