‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’ | PM Says Property Cards Scheme Historical Move | Sakshi
Sakshi News home page

ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించిన మోదీ

Oct 11 2020 2:24 PM | Updated on Oct 11 2020 3:56 PM

PM Says Property Cards Scheme Historical Move - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వమిత్ర పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.

దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు. కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ లింక్‌ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది.

చదవండి : అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement