
51 వేల మందికి నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా కేంద్రం నేడు 16వ రోజ్‌గార్ మేళాను నిర్వహించనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 51 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.
ఇప్పటి వరకు నిర్వహించిన 15 రోజ్‌గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి పైగా నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర ముఖ్యమైన శాఖల్లో ఈ నియామకాలను చేపట్టింది. శనివారం నియామక పత్రాల పంపిణీ అనంతరం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.