స్వర్ణ విజయజ్యోతి వెలిగించిన మోదీ | PM Modi Pays Tribute To National War Memorial On Vijay Diwas In Delhi | Sakshi
Sakshi News home page

విజయ్‌ దివస్‌ : స్వర్ణ విజయజ్యోతి వెలిగించిన మోదీ

Dec 16 2020 11:31 AM | Updated on Dec 16 2020 4:04 PM

PM Modi Pays Tribute To National War Memorial On Vijay Diwas In Delhi - Sakshi

ఢిల్లీ : బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కలిగించిన 1971 ఇండో-పాక్‌ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయజ్యోతిని వెలిగించారు. కాగా ఈ స్వర్ణ విజయజ్యోతిని 1971 యుద్ధం తర్వాత పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింఘ​, చీఫ్‌ ఆప్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.  కాగా ఈ ఏడాదితో భారత్‌ విజయానికి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణ విజయ సంవత్సరంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

1971లో తూర్పు పాకిస్తాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్‌)లో స్వతంత్రం పేరుతో మొదలైన ఇది భారత్‌- పాక్‌ యుద్దానికి తెరలేపింది. డిసెంబర్‌ 3 1971న మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16న ముగిసింది. ఈ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో బంగ్లాదేశ్‌ ఏర్పడింది. యుద్ధంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్‌ 16ను విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement