పాక్‌పై ప్రతీకారం.. 8 మంది హతం | Pakistani soldiers killed in retaliatory fire | Sakshi
Sakshi News home page

పాక్‌పై ప్రతీకారం.. 8 మంది హతం

Nov 13 2020 7:59 PM | Updated on Nov 13 2020 8:09 PM

Pakistani soldiers killed in retaliatory fire - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో కాల్పులకు దిగిన దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. పాక్‌ తూటా దెబ్బకి.. భారత్‌ అదే రీతిలో సమాధానమిచ్చింది. పాక్‌ బంకర్లపై భారత సైన్యం తూటాల వర్షం కురిపించింది. భారత జవాన్ల కాల్పుల్లో 8 మంది పాక్‌ రేంజర్లు హతమయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. అంతకుమందు ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య కాల్పుల నేపథ్యంలో కశ్మీర​ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంబడి బలగాలను మరింత అప్రమత్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement