
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు: ఒక అవ్వను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే పెద్ద డ్రామానే చేసింది. ఇంటింటికీ టీకాలో భాగంగా ఒక తహసీల్దార్ దావణగెరె జిల్లా కైదాళ గ్రామానికి వెళ్లారు. ఒక వృద్ధురాలికి టీకా వేయించుకోవడం ఇష్టం లేక అమ్మవారు పూనినట్లు నటించింది. ‘నా బిడ్డా.. రా... నిన్ను నా ఒడిలో చేర్చుకుంటా’ అంటూ కేకలు వేయసాగింది. తహశీల్దార్ కూడా నాటకీయంగా స్పందించారు. ‘దేవీ నీవే నా కలలోకి వచ్చావు. వచ్చి నీకు టీకా వేయించమన్నావు. ఇది నీ ఆజ్ఞనే’ అని తహశీల్దార్ అరిచేటప్పటికీ అవ్వ కరోనా టీకాకు ఒప్పుకుంది.