ఒడిశా రైలు ప్రమాదం: రాత్రింబవళ్లు అక్కడే..

Odisha Train Accident: Track Restoration Work Going On War Footing - Sakshi

కొరాపుట్‌: బాలేశ్వర్‌ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్‌ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్‌ సరి్టఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్‌ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. 

అందుకే.. అంత వేగంగా..
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్‌ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు.

మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నయక్‌ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి.

చదవండి: తగ్గిన జీడి.. పెరిగిన కోడి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top