వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తేల్చి చెప్పిన అధికారులు!

No Covid Vaccine, No Salary: Says Thane Civic Body - Sakshi

ముంబై: క‌రోనా క‌ట్ట‌డికి నూరు శాతం వ్యాక్సినేష‌న్ సాధించాల‌నే ల‌క్ష్యంతో థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల‌కు జీతం ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. సోమవారం సివిక్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ, థానే మేయర్ నరేష్ మస్కే సహా సీనియర్ టీఎంసీ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సోమవారం అర్థరాత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, మొదటి డోస్ తీసుకోని పౌర ఉద్యోగులకు జీతాలు చెల్లించేది లేదంటూ స్పష్టం చేసింది. నిర్ణీత వ్యవధిలోపు రెండోసారి వ్యాక్సిన్‌ తీసుకోని పౌర ఉద్యోగులకు కూడా జీతాలు అందవని ఆ ప్రకటనలో పేర్కొంది. పౌర ఉద్యోగులందరూ తమ టీకా సర్టిఫికేట్‌లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించడాన్ని టీఎంసీ తప్పనిసరి చేసింది. ఈ నెలాఖరులోగా నగరంలో వాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం అనంతరం మస్కే విలేకరులతో అన్నారు.
 
చదవండి: గుజరాత్‌: ముగ్గురు మైనర్లపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారి కేకలు వేయడంతో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top