అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం

Nitish Kumar Remarks On Dowry System, Child Marriage, Liquor Ban - Sakshi

బిహార్‌ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

వరకట్నం తీసుకోవడం తప్పన్న నితీశ్‌

మహిళల డిమాండ్‌ మేరకే మద్యపాన నిషేధం

పట్నా: వర కట్నానికి వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకోలేదని వరుడి తరపు వారు చెబితేనే తాను పెళ్లికి హాజరవుతానని ఆయన అన్నారు. పట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్‌ను ఈనెల 23న ప్రారంభించిన సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లికొడుకు కట్నం తీసుకోలేదని రాతపూర్వకంగా తెలిపితేనే పెళ్లికి హాజరవుతానని అందరికీ చెప్పినట్టు వెల్లడించారు.

పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పెళ్లి కోసం కట్నం తీసుకోవడం దారుణం. మీరు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్న మనమంతా తల్లులకు పుట్టాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా?’ అంటూ సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. (క్లిక్‌: 54% మహిళలకే సొంత సెల్‌ఫోన్‌)

ప్రచార కార్యక్రమాలతో వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమ్మాయిలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిందని నితీశ్‌ కుమార్‌ అన్నారు. (క్లిక్‌: కాంగ్రెస్‌కు కపిల్‌ సిబల్‌ రాజీనామా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top