విచిత్రమైన కేసు: చిలుక సాక్ష్యంతో నిందితుడికి జీవిత ఖైదు

Nine Years After The Murder With Parrots Testimony Gets life In Jail - Sakshi

హత్య జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత నిందితుడి జైలు శిక్ష విధించింది కోర్టు. అదీకూడా ఒక చిలుక సాక్ష్యం ఆధారంగా ఈ కేసు చిక్కుముడి వీడి నిందితుడికి శిక్ష పడేలా జరగడం ఈకేసులో మెయిన్‌ ట్విస్ట్‌. ఇలాంటి విచిత్రమైన కేసు ఇదే ప్రపథమం కాబోలు.

అసలేం జరిగిందంటే..ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ విజయ్‌ శర్మ భార్య నీలం శర్మ ఫిబ్రవరి 20. 2014న హత్యకు గురయ్యారు. ఐతే ఆరోజు అతడి భార్య, పెంపుడు కుక్క హత్యకు గురవ్వడమే కాకుండా ఆ ఇంట్లో చోరీ కూడా జరిగింది. వాస్తవానికి ఆరోజు విజయ్‌ శర్మ తన కొడుకు రాజేష్‌, కుమార్తె నివేదితతో కలిసి ఫిరోజాబాద్‌లోని ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఐతే అతడి భార్య నీలం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది.

అదేరోజు అర్థరాత్రి విజయ్‌ శర్మ, పిలల్లు ఇంటికి తిరిగి వచ్చి చూడగా..తన భార్య, కుక్క మృతదేహాలను చూసి అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో వారు పోలీసులును ఆశ్రయించగా..వారిని నిందితుడు పదునైనా ఆయుధంతో గాయపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఈ ఘటన జరిగిన రోజు తమ పెంపుడు చిలుక చేస్తున్న అరుపులకు అనుమానం వచ్చి తన మేనల్లుడిని ఆశుని ప్రశ్నించాల్సిందిగా అభ్యర్థించాడు.

ఈ క్రమంలో పోలీసులు చిలుక ముందు అనుమానితులు ఒక్కొక్కటి పేరు చెబుతున్నప్పుడూ..అశుకి భయపడి అషు.. అషు అని పిలవడం ప్రారంభించింది. దీంతో అశుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తర్వాత పక్షి సైలెంట్‌ అయిపోయి తినడం తాగడం మానేసిందని ఆరునెలల తర్వాత చనిపోయిందని విజయ్‌ శర్మ కూతురు నివేదిత చెప్పింది. ఈ కేసు ఆద్యాంతం చిలుక కీలక  సాక్ష్యం ఆధారంగా ఉండటంతో..నిందితుడి జీవిత ఖైదు విధించింది కోర్టు. అదికూడా హత్య జరిగిన తొమ్మిదేళ్లకు శిక్ష పడింది.

ఈలోగా నివేదిత తండ్రి విజయ్‌ శర్మ కూడా కరోనా మహమ్మారి సమయంలో నవంబర్‌ 14, 2020న చనిపోయారు. తమ కుటుంబం అంతా ఆశుకి శిక్ష పడాలని కోరుకున్నామని నివేదిత ఆవేదనగా చెబుతోంది. ఈ మేరకు నివేదిత మాట్లాడుతూ..ఆశు తమ ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడని, తన ఎంబీఏ చదువుకు కూడా తన నాన్న రూ. 80 వేలు ఇచ్చాడని తెలిపింది. ఆశుకి తమ ఇంట్లో ఆభరణాలు, డబ్బు ఎక్కడ ఉంటాయో తెలుసనని కాబట్టే చాలా పక్కగా ప్లాన్‌ చేసి చంపగలిగాడని కన్నీటిపర్యంతమైంది. 

(చదవండి: వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top