సముద్రంలో కూలిన మిగ్‌-29కే శిక్షణ విమానం

Navy's Mig 29k Aircraft Crashes - Sakshi

న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిగ్‌-29కే శిక్షణా విమానం ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు  ఆర్మీ అధికారులు ఇవాళ ఉదయం వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ఒక పైలట్‌ను సురక్షితంగా కాపాడారు. మరొకరు గల్లంతు అయినట్లు తెలిపారు. గల్లంతు అయిన పైలట్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టమని నేవీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top