ఐఏఎస్‌ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా

Mysore Corporation Commissioner Shilpa Nag Resigns To Her Post - Sakshi

మైసూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ శిల్పానాగ్‌ రాజీనామా  

కలెక్టర్‌ రోహిణి సింధూరిపై ఆరోపణలు  

మైసూరు: ‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’అని మైసూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ శిల్పా నాగ్‌ ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి విధి నిర్వహణలో పదేపదే అడ్డొస్తున్నారని శిల్పానాగ్‌ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ రోహిణి సింధూరి తనను పని చేసుకోనివ్వడం లేదన్నారు. అడగడుగునా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకార కలెక్టర్‌ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు.  

రాజీనామానే మంచిదనుకున్నా  
ఒక ఐఏఎస్‌ అధికారికి, మరో ఐఏఎస్‌కు మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్‌ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. తాను కలెక్టర్‌కు అన్నివిధాలా గౌరవం ఇ చ్చానని, కానీ తనపై ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదని అన్నారు. కాగా, శిల్పా నాగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

చదవండి: ఏడేళ్ల న్యాయ పోరాటానికి తెర

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top