ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది.
జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment